ETV Bharat / state

విశాఖ జిల్లాకు తగ్గిన ఇసుక సరఫరా

కొద్ది రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో విశాఖ జిల్లాకు ఇసుక సరఫరా తగ్గింది. అలాగే అక్రమంగా ఇసుక సరఫరా చేసిన కేసు వ్యవహారం దర్యాప్తులో ఉన్నందున శ్రీకాకుళం నుంచి రావాల్సిన ఇసుక నిలిచిపోయింది.

విశాఖ జిల్లాకు తగ్గిన ఇసుక సరఫరా
విశాఖ జిల్లాకు తగ్గిన ఇసుక సరఫరా
author img

By

Published : Oct 10, 2020, 2:39 PM IST

వర్షాలతో విశాఖ జిల్లాకు ఇసుక సరఫరా తగ్గింది. అక్రమంగా ఇసుక సరఫరా చేసిన కేసు వ్యవహారం దర్యాప్తులో ఉన్నందున శ్రీకాకుళం నుంచి రావాల్సిన ఇసుక నిలిచిపోయింది. ఈ కారణంగా నగర పరిధి భీమిలితో పాటు గ్రామీణ జిల్లాలోని నర్శీపట్నం, నక్కపల్లి నిల్వ కేంద్రాలు నిండుకున్నాయి. కొద్ది రోజులుగా ఇక్కడ ఇసుక లేకపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. భీమిలి నియోజకవర్గం నుంచి దరఖాస్తు చేసుకున్న వారికి ముడసర్లోవ నుంచి, నక్కపల్లిన, నర్శిపట్నం నుంచి దరఖాస్తు చేసిన వినియోగదారులకు తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నుంచి రవాణా చేస్తున్నారు.
శ్రీకాకుళంలో ఇసుక అక్రమ రవాణా కేసును స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) విచారణ చేస్తున్నందున ప్రస్తుతం జిల్లా అవసరాలకు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇసుక తెప్పిస్తున్నారు. వర్షాల వల్ల ఇక్కడి నుంచి తక్కువగానే వస్తుంది. జిల్లాలోని ఎనిమిది నిల్వ కేంద్రాల్లో 2.25 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. అత్యధికంగా ముడసర్లోవలో 1.20 లక్షల టన్నులు, అగనంపూడిలో 60 వేల టన్నులు ఉంది.
భీమిలి నిల్వ కేంద్రంలో ఇసుక లేకపోవడంతో ఆ కేంద్రానికి దరఖాస్తు చేసుకున్న వినియోగదారుల కోసం రోజూ 400 టన్నుల ఇసుకను ముడసర్లోవ నుంచి తరలిస్తున్నారు. అలాగే నర్శీపట్నం, నక్కపల్లి కేంద్రాలకు పెట్టుకున్న వారికి జగ్గంపేట నుంచి రోజుకు 200 టన్నుల చొప్పున రవాణా చేస్తున్నారు.
సాధారణంగా తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల నుంచి పదివేలు చొప్పున 20 వేల టన్నుల ఇసుక జిల్లాకు రవాణా అయ్యేది. ప్రస్తుతం ఒక్క తూర్పు గోదావరి నుంచి మాత్రమే సరఫరా అవుతుంది. ప్రస్తుతం అక్కడ వరదల కారణంగా చాలా తక్కువగా వస్తోంది. ముడసర్లోవలో 1.20 లక్షలు, అగనంపూడి 60 వేలు, అచ్యుతాపురం 15 వేలు, చోడవరం 10 వేలు, అనకాపల్లి 20 వేల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని జిల్లా ఇసుక అధికారి రాజు తెలిపారు.
ఇదీ చదవండి

పాతక్షక్షలతో యువకుడిపై కత్తితో దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.