Police Case on Kodali Nani : మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కొడాలి నానిపై కేసు నమోదైంది. విశాఖ మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజనప్రియ శనివారం రాత్రి ఫిర్యాదు చేసింది. కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు మూడేళ్లపాటు చంద్రబాబు, లోకేశ్‌ను సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడారని, ఓ మహిళగా ఆ తిట్లు భరించలేకపోయానని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కొడాలి నానిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రమణయ్య పేర్కొన్నారు.
కొడాలి నాని, వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు నమోదు - Case Against on EX MLA Kodali Nani