ETV Bharat / state

విజయవాడలో ఇక సాఫీగా ప్రయాణం - ఊపిరి పీల్చుకుంటున్న సామాన్యులు

దెబ్బతిన్న రోడ్లు బాగుచేయడంపై దృష్టిసారించిన ప్రభుత్వం - గుంతలు పూడ్చడంతో సాఫీగా ప్రయాణం

government_focus_on_roads_repair_in_vijayawada
government_focus_on_roads_repair_in_vijayawada (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Government Focus on Roads Repair in Vijayawada : రహదారుల మరమ్మతులపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. వైఎస్సార్సీపీ పాలనలో ఐదేళ్లలో గాలికి వదిలేసిన రోడ్లను బాగుచేయడంపై దృష్టి సారించింది. రాష్ట్ర రహదారులు, గ్రామీణ రోడ్లతో పాటు నగరాల్లోని అంతర్గత రోడ్లకూ యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. విజయవాడలో దెబ్బతిన్న రోడ్లను బాగు చేసేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు.

వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో అడుగు బయటపెట్టాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులు తెచ్చారు. బయటకు వెళ్లిన మనిషి క్షేమంగా ఇంటికి తిరిగొస్తాడన్న నమ్మకం లేకుండా చేశారు. దెబ్బతిన్న రహదారులతో నిత్యం రోడ్డు ప్రమాదాలతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. గుంతలు తేలిన రోడ్లతో వాహనదారులు నరకం చూశారు. ఐదేళ్లపాటు కనీస మరమ్మతులకు నోచుకోక భారీ గుంతలు ఏర్పడ్డాయి.

Pothole Free Roads in Andhra Pradesh : నిత్యం రద్దీగా ఉండే విజయవాడ నగరంలోని అంతర్గత రోడ్లనూ బాగు చేయలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రహదారుల మరమ్మతులపై ప్రత్యేక దృష్టిసారించింది. నగర, పురపాలికల్లో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టింది. విజయవాడలోని మూడు సర్కిళ్లలో 14వందల 86 గుంతలను గుర్తించి, వీటిలో 478 పూడ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ముఖ్య రహదారులకూ మరమ్మతుల చేపట్టారు. కొత్త రోడ్లు నిర్మించకున్నా కనీసం ఉన్నవాటిల్లో గుంతలు పూడ్చడం పట్ల వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ దుస్థితికి గత పాలకుడే కారణం - రోడ్లపై గుంతలు లేకుండా చేస్తాం: సీఎం చంద్రబాబు

'గత ఐదు సంవత్సరాలు మా సమస్యలు పట్టించుకున్న వారే లేరు. రోడ్లపై ప్రయాణించలేక చాలా సమస్యలు ఎదుర్కాన్నాం. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక రోడ్లకు మరమ్మతులు జరుగుతున్నాయి. ప్రయాణికులుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇన్నేళ్ల రోడ్ల కష్టాలు ఇక కడతేరనున్నాయి. ఎంతో సంతోషంగా ఉంది. ఇంతకు ముందు బయటకెళ్లాలంటే భయమేసేది. ఏ గుంత ఏ ప్రమాదం తెచ్చిపెడుతుందోనని వణికిపోయేవాళ్లం. కానీ ఇప్పుడా ఇబ్బంది తొలగిపోతుంది. విజయవాడలోని అన్ని రహదారులను మరమ్మతులు జరుగుతున్నాయి.' - స్థానికులు

విజయవాడలో సర్కిళ్లవారీగా ఇప్పుడు రహదార్ల గుంతలు పూడుస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనదారులను దారి మళ్లించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపడున్నారు.

మంచిరోజులొచ్చాయ్​ - గుంతల రోడ్లకు మరమ్మతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.