విశాఖ జిల్లాలో రథ సప్తమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా సూర్య నమస్కార కార్యక్రమాన్ని నిర్వహించాయి. తితిదే రిజర్వేషన్ కౌంటర్‌కు సమీపంలో వందలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సింహాద్రి అప్పన్న సన్నిధిలో...
సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా రథ సప్తమి నిర్వహించారు. రాతి రథంపై స్వామి వారిని అధిష్టించి అభిషేకాలు, పారాయణాలు చేశారు. సూర్యనారాయణస్వామిని సూర్యప్రభ వాహనంపై తిరువిధుల్లో విహరింపజేశారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామి దర్శనానికి పోటెత్తారు. కోవిడ్ నిబంధనల కారణంగా దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సింహాద్రి అప్పన్న వేద పాఠశాలలో విద్యార్థులు పారాయణం చేపట్టారు.
ఇదీ చూడండి:
తిరుమలేశునికి సప్త వాహన సేవలు... దర్శనానికి పోటెత్తిన భక్తులు