ఉపాధి హామీ నిధులతో విశాఖ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి పనుల నాణ్యతను క్వాలిటీ కంట్రోల్ ఇంజినీరింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు. మొదటి విడతగా జిల్లాలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, జలవనరులు, అర్ డబ్ల్యూఎస్ తదితర విభాగాల్లో చేపట్టిన పనులను ఎనిమిది బృందాలు పరిశీలిస్తున్నాయి.
ఉపాధి నిధులతో గత ప్రభుత్వం హయాంలో దాదాపు రూ.800 కోట్లకు పైగా ఖర్చు చేసి పనులు చేపట్టారు. వీటికి ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదు. బిల్లులు చెల్లించని పనులను క్వాలిటీ కంట్రోల్ ఇంజినీరింగ్ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో చేపట్టిన పనుల్లో ఏ మేరకు నాణ్యత ఉందన్న దానిపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.
చోడవరం నియోజకవర్గంలో ఎనిమిది బృందాలు ఈ తనిఖీలు చేపట్టాయి. చోడవరంలో క్వాలిటీ కంట్రోల్ విభాగం డీఈఈ వేణుగోపాలరావు సారథ్యంలో తనిఖీలు జరిగాయి. పనులలో నాణ్యతను పరిశీలించేందుకు కోర్ కటింగ్ చేపడుతున్నట్లు డీఈఈ చెప్పారు.
ఇదీ చదవండి: వర్షం వచ్చింది... వజ్రాల వేట మొదలైంది!