విశాఖ జిల్లా పెందుర్తి రెండు పాములు హల్చల్ సృష్టించాయి. రాజుచెరువు - ప్రశాంతినగర్ రహదారి లోని ఓ కోళ్లఫారంలోకి సుమారు 8 అడుగుల కొండచిలువ ప్రవేశించి కోడిని మింగేసింది. రాజుచెరువు కాలనీలో సుమారు 6 అడుగుల నాగజెర్రి జాతికి చెందిన పాము ఇంట్లోకి చొరబడింది. దీంతో స్థానికులు స్నేక్ క్యాచర్ సురేశ్‌కు సమాచారం అందించారు. ఆయన చాక చక్యంగా పాములను పట్టుకుని దూర ప్రాంతంలో విడిచిపెట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి: