Purandeswari on Ysrcp Stolen Votes: 'విశాఖపట్టణం అభివృద్ధితో భారతీయ జనతా పార్టీకి ఉన్న అనుబంధం ఇవాళ్టి, నిన్నటిది కాదు. 1981 నుంచి బీజేపీకి అనుబంధం ఉంది. ఆనాడు బీజేపీ తరఫున విశాఖ మేయర్‌గా N.S.N రెడ్డి గారు గెలుపుపొందారు. ఆయన నాయకత్వంలోనే విశాఖ మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరిగింది. కనుక విశాఖ అభివృద్ధికి తాము వారసులం అని మేము సగౌరవంగా చెప్పుకుంటున్నాం.' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు.
Purandeswari visited in Visakha: రాష్ట్ర పర్యటనలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మంగళవారం విశాఖపట్టణం జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆమె E.S.I (ఈఎస్‌ఐ) ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం అక్కడ జరుగుతున్న పనులు, నిర్మాణాలను పరిశీలించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లను నమోదు చేస్తోందని పురందేశ్వరి ఆరోపించారు. రాష్ట్రంలో నాసిరకం మద్యాన్ని పంపిణీ చేస్తూ, ప్రజల ప్రాణాలతో జగన్ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు ఇల్లు కట్టించి అందించడంలోనూ వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆమె విమర్శించారు.
టిడ్కో గృహాల నిర్మాణంలో జగన్ ప్రభుత్వం విఫలం - ఒక్క లబ్ధిదారుడికి కూడా ఇల్లు అందలేదు: పురందేశ్వరి
Purandeswari Comments: ''టిడ్కో ఇళ్లను ప్రజలకు అందించడంలో సీఎం జగన్ ఘోరంగా విఫలమయ్యారు. రాష్ట్రంలో అమలవుతున్న పలు పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంటే, ఈ జగన్ ప్రభుత్వం వాటిపై స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారు. అందుకే ఈ ప్రభుత్వాన్ని స్టిక్కర్ల ప్రభుత్వం అని మేము పిలుస్తున్నాం. ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని వైసీపీ కార్యాలయంగా మార్చేశారు. విశాఖ రుషికొండలో పర్యావరణ ఉల్లంఘన జరిగింది. ఆ కొండని బోడి గుండులా తయారు చేశారు. ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వం అందించే కోడిగుడ్లపై కూడా జగన్ బొమ్మను వేసుకున్నారే జగన్ పాలన ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం రైల్వేజోన్ ఏర్పాటు చేసి, నిధులు మంజూరు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం కనీసం కేంద్ర కార్యాలయానికి భూమిని కూడా అందించకలేకపోయింది.'' అని భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షుల సమావేశంంలో పురందేశ్వరి ధ్వజమెత్తారు.
ఏపీలో కక్షపూరిత, విధ్వంస రాజకీయాలు - వైసీపీ కుంభకోణాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి : పురందేశ్వరి
Purandeswari on Visakha Metro: మెట్రో రైల్ ప్రాజెక్టుకు డీపీఆర్‌ను అందించడంలో జగన్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని పురందేశ్వరి ఆగ్రహించారు. ఈఎస్ఐ ఆసుపత్రి విషయంలో ఎంతో ఒత్తిడి తెస్తేనే భూమిని కేటాయించారని ఆమె గుర్తు చేశారు. విశాఖలో అనేక ప్రభుత్వ ఆస్తులను వైసీపీ ప్రభుత్వం తనఖా పెట్టిందని, విశాఖలోని భూములను వైసీపీ నాయకులు దోచుకుంటున్నారని పురందేశ్వరి ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రబుత్వం ఐటీ రంగాన్ని పూర్తిగా దిగజార్చడంతో అనేక ఐటీ పరిశ్రమలు విశాఖను వదిలి వెళ్తున్నాయని పురందేశ్వరి ఆవేదన చెందారు.
విశాఖ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. ఎన్నో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను బీజేపీ ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రధాని ప్రధాని మోదీ దూరదృష్టి కారణంగానే భారత్ అభివృద్ధి పథంలో ముందుకెళుతోంది. ఇప్పటికైనా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న సహాయ సహకారాలను రాష్ట్ర ప్రజలకు వివరించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను.- పురందేశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు
కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో పథకాలు అమలవుతున్నాయి: పురందేశ్వరి