ETV Bharat / state

అనకాపల్లిలో విద్యుత్ బిల్లులపై నిరసన - ఏపీలో లాక్‌డౌన్‌ వార్తలు

కరోనా సమయంలో లాక్​డౌన్​తో ఇబ్బందిపడుతుంటే ఇప్పుడు కరెంటు బిల్లులు పెంచడం దారుణమని ప్రజలు వాపోతున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో విద్యుత్ అధికారులు అధిక బిల్లులు వసూలు చేస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు.

Public protest on electricity bills in Anakapalli
అనకాపల్లిలో విద్యుత్ బిల్లులపై నిరసన
author img

By

Published : May 11, 2020, 6:08 PM IST

విద్యుత్ బిల్లులు అధిక మొత్తంలో అధికారులు వసూలు చేస్తున్నారని విశాఖ జిల్లా అనకాపల్లిలో ప్రజలు ధర్నా చేశారు. విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద తేదేపా నాయకులతో కలిసి సమస్యను అధికారులకు వివరించారు. ఫిబ్రవరి నెలలో ఎంత మొత్తం బిల్లు వచ్చిందో దాన్ని మార్చి నెలలో కట్టాలని విద్యుత్ శాఖ అధికారులు చెప్పడంతో తాము చెల్లించామనన్నారు. ఏప్రిల్ నెలలో విద్యుత్ వాడకాన్ని రీడింగ్ నమోదుచేసి అధిక మొత్తంలో బిల్లులను తమ చేతిలో పెట్టారని వాపోయారు. యూనిట్లో పెరుగుదల స్లాబ్​ని సక్రమంగా చేపట్టలేదని, దీనిపై పరిశీలన చేసి అధికంగా వచ్చిన బిల్లును సరి చేయాలని కోరారు. అనకాపల్లి విద్యుత్ శాఖ డీఈ సత్యనారాయణకి సమస్యను వివరించారు. విద్యుత్ బిల్లులు రద్దు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు కోరారు

ఇదీచూడండి.
విశాఖలో కేంద్ర నిపుణుల బృందం పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.