ETV Bharat / state

'రైతులకు దేశ ప్రజలందరూ అండగా ఉండాలి' - ఢిల్లీలో రైతుల ఆందోళన తాజా వార్తలు

వ్యవసాయ సవరణ చట్టాలను అక్రమంగా ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించుకుందంటూ.. ప్రజాసంఘాల నాయకులు మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం భూమి పుత్రులను అణచివేసే విధానాలను మానుకొని అన్నదాత సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతుల నిరసనకు సంఘీభావంగా విశాఖలో 2 రోజుల నుంచి ఆందోళన చేపట్టారు.

Public associations in Visakhapatnam
ప్రజా సంఘాలు ఆందోళనలు
author img

By

Published : Dec 2, 2020, 1:33 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేపడుతున్న నిరసనకు విశాఖలో ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపాయి. అన్నం పెట్టే రైతన్నకు దేశ ప్రజలందరూ అండగా ఉండాలి అంటూ.. రెండు రోజులుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వ్యవసాయ చట్టాలు రైతు మెడకు ఉరితాడు బిగించే విధంగా.. బడా కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉన్నాయని ఆరోపించారు. కనీస మద్దతు ధరను నిర్వీర్యం చేసేందుకు మార్గం సులభతరం చేసే విధంగా ఉన్నాయని ప్రజా సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:

దేవరాపల్లి-కొత్తవలస రోడ్డు విస్తరణ.. ప్రయాణికులకు తీరనున్న ఇక్కట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.