విశాఖ జిల్లా పద్మనాభం మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడంపై ఆపార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కూల్చి వేసిన ప్రదేశం నుంచి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. కానీ అక్కడ తహసీల్దార్‌తో సహా సిబ్బంది తాళాలు వేసుకుని వెళ్లిపోవడంతో తెదేపా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్దంగా తాము ర్యాలీ చేసి.. వినతి పత్రం ఇచ్చేందుకు వస్తే.. ఈ రకంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. తహసీల్దార్ గది ముందే బైఠాయించి నిరసన చేశారు. కూల్చివేతల ప్రభుత్వం కూలిపోతుందని నినదించారు.
ఇదీ చదవండి: ఎన్ఆర్సీ, సీఏఏకు వ్యతిరేకంగా రాజంపేటలో వామపక్షాల ప్రజాగర్జన