విశాఖ మన్యంలోని చింతపల్లి, కొయ్యూరు మండల తహసీల్దార్లపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైకాపా నాయకులు ఈ ఆందోళనకు నేతృత్వం వహించటం విశేషం. సంబంధిత ఎమ్మార్వోలు గిరిజనులకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకూ నివాస ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడం లేదని అంటున్నారు. ఈ మేరకు కొయ్యూరు, చింతపల్లి మండల కార్యాలయాల ఎదుట స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పాడేరు సబ్ కలెక్టర్.. ఆందోళనకారులతో చర్చించారు. సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: