ETV Bharat / state

'అశోక్​ గజపతి రాజుకు మంత్రి వెల్లంపల్లి క్షమాపణలు చెప్పాలి' - minister vellampalli srinivasa rao

విజయవాడలో క్షత్రియ యువజన సంఘం నేతలు ఆందోళన చేశారు. అశోక్ గజపతి రాజుకు మంత్రి వెల్లంపల్లి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

protest against minister vellampalli srinivasarao in vijayawada, simhachalam
విజయవాడలో క్షత్రియ యువజన సంఘం నేతలు ఆందోళన
author img

By

Published : Jan 5, 2021, 4:08 PM IST

విజయవాడలో...

కేంద్ర మాజీ మంత్రి అశోక్​ గజపతిరాజుపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా... విజయవాడలో క్షత్రియ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. అజిత్ సింగ్ నగర్​లోని బుడమేరు వంతెనపై ఉన్న అల్లూరి సీతారామ రాజు విగ్రహానికి, అశోక్ గజపతి రాజు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. దేశవ్యాప్తంగా.. మంచి గౌరవం కలిగి ఉన్న అశోక్​గజపతి రాజుకు మంత్రి వెల్లంపల్లి క్షమాపణలు చెప్పాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

సింహాచలంలో...

విశాఖపట్నం జిల్లా సింహాచలంలో... కేంద్ర మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలకు వేలాది ఎకరాల భూములు ఇచ్చిన కుటుంబం నుంచి వచ్చిన వారిని దూషించడం సిగ్గుచేటని మండిపడ్డారు. తక్షణమే వారి కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర స్థాయిలో తాము ప్రత్యక్ష పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

'ఆలయాలపై దాడులకు తెదేపాయే కారణమని ప్రమాణం చేయగలరా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.