ETV Bharat / state

చోడవరంలో పీఏసీఎస్​ల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు - vizag district latest news

విశాఖపట్నం జిల్లా చోడవరం మండలంలో మరో ఏడు పీఏసీఎస్​ల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ తెలిపారు. పీఏసీఎస్​లను విస్తరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ చర్యలు చేపట్టారు.

Proposals to the Government for expandation up of PACS in Chodavaram
చోడవరంలో పీఏసీఎస్​ల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు
author img

By

Published : Mar 5, 2021, 4:57 PM IST

రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను (పీఏసీఎస్) విస్తరించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు... విశాఖపట్నం జిల్లా చోడవరం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పీఏసీఎస్​ల మాజీ అధ్యక్షులు, వైకాపా నాయకులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఉన్న 21 పీఏసీఎస్​లకు అదనంగా మరో ఏడు పీఏసీఎస్​లు ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే ధర్మశ్రీ తెలిపారు.

రోలుగుంట మండలంలో వడ్డిప, జె.నాయుడుపాలెం, బుచ్చయ్యపేట మండలంలో రాజాం, పెదమదీనా రావికమతంలో తట్టబంద, చోడవరం మండలంలో వెంకన్నపాలెం, గౌరీపట్నం గ్రామాల్లో కొత్త పీఏసీఎస్​లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

ఇదీచదవండి.

ఎన్నికల సమస్యలపై ఫిర్యాదులకు.. కాల్​ సెంటర్​ను ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.