అందుబాటులో ఉన్న ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్‌లను వినియోగించుకుని... ప్రైవేట్ బస్సు సర్వీసులు తిప్పుకునే విధానాన్ని విశాఖ ప్రాంతీయ ఆర్టీసీ నుంచి ప్రయోగాత్మకంగా మొదలు పెడుతున్నారు. విశాఖ ప్రాంతీయ ఆర్టీసీ అధికారి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలను అధికారులు ప్రైవేట్ వాహన సంస్థల ప్రతినిధులతో చర్చించారు. మొత్తం ఎన్ని ప్రైవేట్ వాహనాలు ఉన్నాయి... ఏయే రూట్లో తిరిగే అనుకూలత ఉందనే అంశాలను చర్చించారు. వీటి కోసం విద్యా సంస్థల బస్సులను వినియోగించే అంశంపై కూడా చర్చించారు. అయితే ఈ అంశంపై రేపు (శనివారం) మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది ప్రభుత్వం. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ, ఆర్టీసీలో తక్కువ బస్సులు ఉన్న కారణంతో విశాఖ నగర ఆర్టీసీలో ఈ నూతన విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆర్టీసీ అధికారులు ఆలోచిస్తున్నారు.
విశాఖలో అందుబాటులోకి రానున్న ప్రైవేటు బస్సు సర్వీసులు - విశాఖలో ప్రైవేటు బస్సు సర్వీసులు వార్తలు
విశాఖలో ప్రైవేట్ బస్సు సర్వీసులు తిప్పుకునే విధానాన్ని ఆర్టీసీ అధికారులు అందుబాటులోకి తేనున్నారు. ప్రైవేట్ వాహన సంస్థల ప్రతినిధులతో అధికారులు విశాఖ ప్రాంతీయ ఆర్టీసీ అధికారి కార్యాలయంలో పలు అంశాలపై చర్చలు జరిపారు.
![విశాఖలో అందుబాటులోకి రానున్న ప్రైవేటు బస్సు సర్వీసులు Private bus services to be available in Visakapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5987247-565-5987247-1581057893170.jpg?imwidth=3840)
అందుబాటులో ఉన్న ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్‌లను వినియోగించుకుని... ప్రైవేట్ బస్సు సర్వీసులు తిప్పుకునే విధానాన్ని విశాఖ ప్రాంతీయ ఆర్టీసీ నుంచి ప్రయోగాత్మకంగా మొదలు పెడుతున్నారు. విశాఖ ప్రాంతీయ ఆర్టీసీ అధికారి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలను అధికారులు ప్రైవేట్ వాహన సంస్థల ప్రతినిధులతో చర్చించారు. మొత్తం ఎన్ని ప్రైవేట్ వాహనాలు ఉన్నాయి... ఏయే రూట్లో తిరిగే అనుకూలత ఉందనే అంశాలను చర్చించారు. వీటి కోసం విద్యా సంస్థల బస్సులను వినియోగించే అంశంపై కూడా చర్చించారు. అయితే ఈ అంశంపై రేపు (శనివారం) మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది ప్రభుత్వం. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ, ఆర్టీసీలో తక్కువ బస్సులు ఉన్న కారణంతో విశాఖ నగర ఆర్టీసీలో ఈ నూతన విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆర్టీసీ అధికారులు ఆలోచిస్తున్నారు.
ఇదీ చదవండి: విశాఖలో భూసమీకరణకు రైతులు ససేమిరా!