విశాఖ జిల్లా చోడవరంలో కరోన వైరస్ బారిన పడకుండా వైద్యులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. విదేశాల నుంచి వచ్చిన ఎనిమిది మంది వల్ల వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. వారికి ముందుగానే విమానాశ్రయంలో స్క్రీనింగ్ చేయడంతో వైద్యులు కొంత ఊరట చెందారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ముందుగా ఉష్ణోగ్రత పరీక్షలు జరుపుతున్నారు. దగ్గు, రొంప వంటి లక్షణాలను నిర్ధారించుకుంటున్నారు. కొవిడ్ - 19 వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక ఐసోలేషన్ వార్డును తయారుచేశారు. వైద్యులతో పాటు సిబ్బంది... మాస్క్లు ధరించి సాధారణ రోగులను పరీక్షిస్తున్నారు.
ఇదీ చదవండి :