ETV Bharat / state

'రేషన్ డీలర్లకు వృత్తి, ఆర్థిక భద్రత కల్పించాలి' - divileela madhava rao news

రేషన్ డీలర్లకు వృత్తి భద్రత కల్పించాలని.. రాష్ట్ర రేషన్ డీలర్స్ అధ్యక్షులు డిమాండ్ చేశారు. డోర్ డెలివరీ విధానంలో కోల్పోతున్న.. నాన్​ పీడీఎస్ సరకుల ఆదాయానికి ప్రత్యామ్నాయంగా అదనపు కమీషన్ చెల్లించాలన్నారు.

ration dealers
రాష్ట్ర రేషన్ డీలర్స్ అధ్యక్షులు
author img

By

Published : Feb 16, 2021, 4:11 PM IST

రేషన్ పంపిణీ చేసే డీలర్లకు.. వృత్తి, ఆర్థిక భద్రత కల్పించాలని రాష్ట్ర రేషన్ డీలర్ల అధ్యక్షులు దివిలీలా మాధవరావు డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖకు వచ్చిన ఆయన... మర్రిపాలెంలోని రేషన్ డీలర్ల జిల్లా అధ్యక్షులు కాళ్ల మణి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.

సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు డీలర్ల వ్యవస్థపై ఆధారపడిన కుటుంబాలకు.. గ్రామాల్లో రూ.18,500, పట్టణాల్లో రూ.24,500 గౌరవ వేతనం ఇవ్వాలన్నారు. ఫార్మ్ అప్ ఆథరైజేషన్ యాక్ట్ ప్రకారం డీలర్ పేరుతో ఆథరైజేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డోర్ డెలివరీ విధానంలో డీలర్లు కోల్పోతున్న నాన్ పీడీఎస్ సరకులు ఆదాయానికి.. ప్రత్యామ్నాయంగా కమీషన్​తో పాటు ప్రతి కార్డుకు 15 రూపాయలు అదనంగా చెల్లించాలన్నారు. కరోనా సమయంలో రేషన్ పంపిణీ చేసిన సరకుల కమీషన్ రూ.180 కోట్లు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. వైరస్ బారిన పడి మరణించిన డీలర్ల కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించాలని కోరారు.

ఇదీ చదవండి: మావోయిస్టు హెచ్చరికలతో మన్యం వాసుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.