ETV Bharat / state

వైద్యసేవల్లో లోపం... గర్భిణులకు శాపం..! - పాడేరు జిల్లా ఆసుపత్రి వార్తలు

పాడేరు ఆసుపత్రిలో సిబ్బంది కొరత, సరైన వైద్య పరికరాలు లేక గర్భిణులు నరకం చూస్తున్నారు. ఎన్నో కిలోమీటర్లు దాటుకుని వచ్చే వారికి నిరాశే ఎదురవుతోంది. చిన్న చికిత్సకు కేజీహెచ్​కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నా అంబులెన్స్ అందుబాటులో ఉండటం లేదు.

pregnant womens in manyam facing problems due to no fecilities in paderu hospital
ఆసుపత్రిలో వేచి ఉన్న గర్భిణులు
author img

By

Published : Dec 1, 2019, 11:54 PM IST

వైద్యసేవల్లో లోపం... గర్భిణులకు శాపం..!

విశాఖ మన్యం కేంద్రం పాడేరు జిల్లా ఆసుపత్రిలో కనీస వైద్య సేవలు అందక గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రక్త పరీక్షలు చేయించుకోవాలన్న గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మన్యంలో సరైన రహదారులు లేకపోవటంతో ఎన్నో ప్రయాసలు పడి గర్భిణులు జిల్లా ఆసుపత్రికి చేరుకుంటారు. తీరా ఆసుపత్రికి వచ్చాక వైద్య సేవలు అందక మహిళలు అయోమయానికి గురవతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే వైద్య పరీక్షలు చేసేందుకు పరికరాలు లేవంటూ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు.

అయిదుగురు ఉంటేనే అంబులెన్స్..!
పాడేరు జిల్లా ఆసుపత్రి వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. కనీసం మత్తు ఇచ్చే డాక్టర్ కూడా లేకపోవడం గమనార్హం. దీనివల్ల చిన్న చిన్న ఆపరేషన్​లకూ వైజాగ్ కేజీహెచ్​కు గర్భిణులను తరలిస్తున్నారు. ఏ మాత్రం పరీక్షలు చేయకుండానే విశాఖ వెళ్లమని సలహా ఇస్తున్నారు. తీరా కేజీహెచ్​కు వెళ్లాలంటే అంబులెన్స్ అందుబాటులో ఉండటం లేదు. ఒకేసారి అయిదుగురికిపైగా గర్భిణులు ఉంటేనే అంబులెన్స్ ఇస్తున్నారు. ఈలోగా గర్భిణులు నొప్పులు భరించలేక నరకం చూస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కాలయాపనతో వారి ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. సమస్యలను పరిష్కరించి, పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించాలని గిరిజనులు కోరుతున్నారు.

ఇదీ చదవండి

అన్యమత ప్రచారం... అవాస్తవం: వైవీ సుబ్బారెడ్డి

సెంటర్: పాడేరు. శివ పాడేరు ఆసుపత్రిలో నరకం చూస్తున్న గర్భిణీలు....... ఫైల్: 1)Ap_vsp_77_27_garbhineelu_narakam_paderu_pkg_av_ap10082.mp4 2) Ap_vsp_77_27_garbhineelu_narakam_paderu_pkg_ab_ap10082.mp4 యాంకర్: సాధారణంగా అనారోగ్యం చేస్తేనే ఆసుపత్రులు పరిగెట్టి చికిత్స తీసుకుంటాం . మరి మహిళలు గర్భందాల్చినపుడు సక్రమమైన వైద్యం అందక పోయినట్లయితే ప్రాణాలు గాలిలో కలిసి పోయినట్లే విశాఖ మన్యం ఆసుపత్రిలో సరిపడే వైద్యం పరికరాలు సదుపాయాలు పరీక్షలు లేకపోవడంతో గర్భిణీలు నరకం చూస్తున్నారు మన్యం ఆసుపత్రిలో గర్భిణీలు పడుతున్న ఇబ్బందులు కథనం..... . వాయిస్1) విశాఖ మన్య కేంద్రం పాడేరు జిల్లా ఆస్పత్రిలో గర్భిణీలు కనీస సదుపాయాలు, సకాల వైద్యం, సత్వర రక్త పరీక్షలు జరగక మహిళలు ఇక్కట్లకు గురవుతున్నారు ఆసుపత్రి కి చేరుకోవాలంటే మన్యం నలుమూలల నుంచి వాహనాలు ద్విచక్ర వాహనాలుతో పాటు చాలామంది కాలినడకతో బాధపడుతూ ఆస్పత్రికి చేరు కుంటారు. కానీ సకాలంలో వైద్య సేవలు అందక నొప్పులతో అయోమయానికి గురవుతున్నారు. ప్రతి వారం పాడేరు ఆసుపత్రిలో గర్భిణీలకు ప్రత్యేక చికిత్స లు చేస్తుంటారు. నలుమూలల నుంచి గర్భిణీలు అధిక సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుంటారు ఈరోజు కూడా వైద్య పరీక్షల పరికరాలు కిట్లు లేవంటూ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు ఎక్కడ ఎక్కడ నుంచి వచ్చిన గర్భిణీలు నిలబడలేక కూర్చోలేక సతమతమవుతున్నారు. ఇండెంట్ పెడితే గాని రక్త పూతల సామగ్రి రాదంటూ చెబుతున్నారు ముందస్తుగా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. బైట్= గర్భిణీ, ( బ్లూ డ్రెస్) ........ వాయిస్2) పాడేరు జిల్లా ఆస్పత్రి పేరుకే గాని సదుపాయాలు కొరవడుతున్నాయి అవసరమైన సిబ్బంది లేరు, కనీసం మత్తు ఇచ్చే డాక్టర్ కూడా లేకపోవడం గమనార్హం .బ్ దీంతో చిన్న చిన్న ఆపరేషన్ లకు కూడా వైజాగ్ కే జి హెచ్ గర్భిణీలు తరలిస్తున్నారు. ఏమని ప్రశ్నిస్తే పరికరాలు, వైద్యులు లేరంటూ సమాధానాలు దాట వేస్తున్నారు . ఉన్న కొద్దిమంది అరకొరగా పనిచేస్తున్నప్పటికీ గర్భిణీలకు పూర్తిస్థాయిలో వైద్యం అందడం లేదు కళ్ళు, చేతులు పట్టుకుని తేదీలు చూసి మిమ్మల్ని వైజాగ్ తరలించాలి అంటున్నారు ఒకవేళ సిఫార్సు చేస్తున్నా అంబులెన్స్ అందుబాటులో ఉండటం లేదు. ఒకేసారి అయిదుగురు పైబడి గర్భిణీలు ఉంటే అంబులెన్స్ ఇస్తున్నారు ఈలోగా గర్భిణీలు నొప్పులు భరించలేని పరిస్థితిలో ఉంటున్నారు. బైట్: సంజీవరావు, గర్భిణీ భర్త వాయిస్3) ఏజెన్సీలో మహిళలు అమాయకమైన పరిస్థితిలో ఉంటారు. గర్భం తేదీ ఎప్పుడు చెప్పలేని పరిస్థితిలో ఉంటారు ఈ మధ్యనే 9 నెలలు నిండినప్పటికీ అరుణ అనే గర్భిణీ ఎనిమిది నెలలుగా చెప్పి 5 కిలోమీటర్లు పూల గంపల తో నడిచింది. మన్యంలో ప్రసవం వచ్చేంతవరకు పనులు చేసుకోవడం కూడా కొంతవరకు సులభ ప్రసవం అయినప్పటికీ బరువులు మోయడం భారంగా ఉంటుంది. ఆసుపత్రికి వస్తే మహిళలు పడుగాపులు పడుతున్నారు . కొన్ని సందర్భాల్లో కాలయాపన తో గర్భిణీలు ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. బైట్; మణికుమారి, మహిళా కముషన్ సభ్యురాలు ఎండ్ వాయిస్: పాడేరు ఆస్పత్రిలో అవసరమైన గైనకాలజిస్ట్ మత్తు ఇచ్చే వైద్యులు ఆపరేషన్కు అవసరమే పరికరాలు పూర్తిస్థాయిలో కల్పిస్తే గాని మన్యం గర్భిణీలకు వైద్యం అందే పరిస్థితి లేదు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.