ETV Bharat / state

మంచు కురిసే వేళ ప్రయాణమా..? ఇవి పాటించకుంటే ప్రమాదమే..!

Safety Measures while driving in fog : శీతాకాలంలో పొగమంచు వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలు ఈ మధ్య బాగా పెరిగిపోతున్నాయి. రహదారులపై దట్టంగా పొగ మంచు కమ్మేయడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక జరిగే ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రవాణా రంగ నిపుణులు సూచిస్తున్నారు.

మంచు కురిసే వేళ ప్రయాణమా..?
మంచు కురిసే వేళ ప్రయాణమా..?
author img

By

Published : Nov 25, 2022, 8:52 AM IST

Safety Measures while driving in fog : చలికాలం.. మంచు కురిసే వేళలో ముందున్న వాహనం కనిపించక రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రవాణారంగ నిపుణులు సూచిస్తున్నారు. డ్రైవర్లకూ ఆర్టీసీ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.

  • మంచు దట్టంగా కురిసే వేళ ప్రయాణాలు మానుకుంటే మేలు.
  • అనివార్యమైతే వైపర్‌ వాడాలి. హైబీమ్‌ లైట్లకు బదులు, లోబీమ్‌ లైట్లు వేస్తే.. రోడ్డు కనిపించడంతో పాటు.. కాంతి దూరం ఎక్కువగా ఉంటుంది.
  • ముందు వెళ్లే వాహనాల నుంచి సురక్షిత దూరాన్ని పాటించాలి. అకస్మాత్తుగా బ్రేకు వేసినా పక్కకు వెళ్లడానికి వీలుంటుంది.
  • ఇండికేటర్‌ లైట్లను వేసుకొని వెళ్లడం మంచిది. తద్వారా కారు ఉనికిని వాహనదారులు గుర్తించే అవకాశం ఉంటుంది.
  • చేతులను ఎప్పుడూ స్టీరింగ్‌ మీదనే ఉంచి, తక్కువ వేగంతో నడపడం ముఖ్యం.
  • అద్దాలపై పడే మంచును కరిగించడానికి చాలా కార్ల తయారీ సంస్థలు డీ ఫాగర్‌ను అందిస్తున్నాయి. దీని ద్వారా అద్దం వేడెక్కి మంచు కరిగిపోతుంది. సంగీతం తక్కువ శబ్దంతో వినాలి. వీలైతే ఆఫ్‌ చేయడం ఉత్తమం.
  • మద్యం తాగిన వారు మత్తు దిగే వరకు బండిని నడపకూడదు.
  • వాహనాన్ని రోడ్డు పక్కన అపేటప్పుడు సిగ్నల్‌ లైటు వేస్తూ.. నెమ్మదిగా ఆపాలి.
  • ప్రధాన లైట్లు, సిగ్నల్‌ లైట్లు, లోబీమ్‌ లైట్లు అన్నీ వెలిగే స్థితిలో ఉంచాలి.

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.