ETV Bharat / state

సాగునీటి చెరువులో కోళ్ల వ్యర్ధాలు.. రైతుల ఆందోళన

సాగునీటి చెరువులో చేపలకు కోళ్ల వ్యర్ధాలు వేసిన కారణంగా... నీరు కలుషితమై పశువులు అనారోగ్యానికి గురవుతున్నాయని.. విశాఖ జిల్లా చీడికాడ మండలం ఎల్బీ. పట్నం రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి.. చెరువులో ఎవరూ కోళ్ల వ్యర్ధాలు కలపకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

poultry waste in pond
సాగునీటి చెరువులో కోళ్ల వ్యర్ధాలు.. రైతుల ఆందోళన
author img

By

Published : Dec 12, 2020, 1:22 PM IST

విశాఖ జిల్లా చీడికాడ మండలం ఎల్.బీ. పట్నంలో వంద ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం కలిగిన అప్పలరాజు సాగునీటి చెరువు ఉంది. ఈ చెరువులో కొన్నాళ్లుగా చేపల పెంపకందారులు కోళ్ల వ్యర్ధాలు కలుపుతున్నారు. దీంతో చెరువులో నీరంతా కలుషితం అవుతోంది.

ఈ నీరు తాగిన పశువులు రోగాల బారిన పడుతున్నాయని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు నీటిని పంటలకు మళ్లించినప్పుడు శరీరమంతా దురదగా మారుతోందని రైతులు మండిపడుతున్నారు. ఈ విషయంపై చెరువు గట్టువద్ద నిరసన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి.. చెరువులో చేపల పెంపకానికి ఎవరూ కోళ్ల వ్యర్ధాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ఆర్టీసీ లైవ్‌ ట్రాకింగ్‌... కొద్ది నెలలుగా నో వర్కింగ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.