విశాఖ జిల్లా సీలేరు కాంప్లెక్స్ పరిధిలోని పొల్లూరు జలవిద్యుత్కేంద్రం సామర్థ్యం 460 మెగావాట్లు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 1058 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి సాధించాలని సెంట్రల్ ఎలక్ట్రిసిటి అథారిటీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని మార్చి 31వ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉండగా.. రెండు నెలల ముందుగానే అనుకున్నంత విద్యుదుత్పత్తి చేసి సరికొత్త రికార్డు సాధించింది.
ఈ జలవిద్యుత్కేంద్రంలో నాలుగు యూనిట్లు బాగా పనిచేయటంతో పాటు, చిన్నపాటి మరమ్మతులు సైతం అధిగమించి లక్ష్యాన్ని సాధించారు. ఈ సందర్భంగా ఉద్యోగులను, కార్మికులను ఏపీ జెన్‌కో సీఈ గౌరీపతి అభినందించారు. మూడు నెలలు ముందుగానే సీలేరు జలవిద్యుత్కేంద్రం లక్ష్యాన్ని పూర్తి చేయగా, ఆ బాటలోనే పొల్లూరు కేంద్రం కూడా రెండు నెలలు ముందే లక్ష్యాన్ని అధిగమించేందుకు కృషి చేశారని సీఈ అన్నారు.
ఇదీ చదవండి: పాత వంతెన కూలి దశాబ్దం.. కొత్తది అసంపూర్ణం