ETV Bharat / state

విశాఖ జిల్లా వ్యాప్తంగా... కఠినంగా కర్ఫ్యూ ఆంక్షల అమలు

ప్రభుత్వ ఆదేశాల మేరకు విశాఖ జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ కఠినంగా అమలవుతోంది. కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని అధికారులు, పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇళ్ల వద్దనే క్షేమంగా ఉండాలని వారు కోరుతున్నారు.

curfew at vishapatnam district
విశాఖ జిల్లాలో కఠినంగా కర్ఫ్యూ ఆంక్షల అమలు
author img

By

Published : May 5, 2021, 5:02 PM IST

ప్రజల్లో కొంత అవగాహన వచ్చిందంటున్న ఓ ట్రాఫిక్​ పోలీసు...

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో నేటి నుంచి విశాఖ జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి పాక్షిక కర్ఫ్యూ అమలులోకి రాగా... వ్యాపార సముదాయాలు, దుకాణాలు మూసివేశారు. ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. అనేక చోట్ల పోలీసులు చెక్​ పోస్టులు ఏర్పాటు చేసి నిబంధనల అమలుకు కృషి చేస్తున్నారు. కరోనా కట్టడికి సహకరించి ప్రజలు ఇళ్ల వద్దే ఉండాలని వారు సూచిస్తున్నారు.

తొలి రోజు రహదారులపైకి వచ్చినవారికి పోలీసులు అవగాహన కల్పించారు. జిల్లాలోని అనకాపల్లి, జి.మాడుగల, విశాఖ మన్యం, ఎలమంచిలి నియోజకవర్గల్లో పోలీసులు ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. మన్యంలో నిత్యావసరాలు, మందుషాపుల ముందు బారులు తీరిన వారిని పోలీసులు ఇళ్లకు పంపించివేశారు. సైరన్​ మోగిస్తూ గస్తీ నిర్వహించారు. అనేక చోట్ల మైక్​లలో కరోనా పరిస్థితులపై ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించారు.

ఇవీ చదవండి:

చేతులు పదేపదే కడుగుతున్నారా?

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.