ETV Bharat / state

విశాఖ మన్యంలో.. అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు - Visakhapatnam latest updates

విశాఖ మన్యం ధారకొండ ఘాట్ రోడ్డులో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను విశాఖ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి కారు, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

విశాఖ మన్యంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు

author img

By

Published : Nov 1, 2021, 9:59 PM IST

విశాఖ మన్యం ధారకొండ ఘాట్ రోడ్డులో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను ఎట్టకేలకు విశాఖ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి కారు, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సీఐ అశోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ గ్రామీణ ఎస్పీ బి. కృష్ణారావు ఆదేశాల మేరకు నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. ధారకొండ ఘాట్ రోడ్డులో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారు జామున ఘాట్ రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

వారిని విచారించగా గత నెల 23న ఓ కారును అపహరించిన కేసులో కీలక నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అదుపులో తీసుకున్న వారిలో ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లాకు చెందిన నీలకంఠ బిశ్వాస్, హరేశ్ బిశ్వాస్, సుశాంతాయ్, మహేశ్ సర్కార్ గా గుర్తించారు. అయితే.. వీరితోపాటు మరో ముగ్గురు ఉన్నారని వారు పరారీలో ఉన్నట్లు సీఐ అశోక్ కుమార్ వెల్లడించారు.

ఇదీ చదవండి:

లారీ ఢీకొని నుజ్జునుజ్జయిన కారు- నవదంపతులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.