విశాఖ శివాజీపాలెంలో కొలువైన శ్రీ చినపోలమాంబ అమ్మవారి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీకృష్ణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతరలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయంలో అమ్మవారికి విశేష అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. రాష్ట్రంలో మళ్లీ తెదేపా అధికారంలోకి రావాలని కోరుకున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు.
ఇది కూడా చదవండి.