ETV Bharat / state

విశాఖ ఘటనపై ప్రధాని కార్యాలయం ప్రత్యేక దృష్టి - విశాఖ ఎల్జీ పాలిమర్స్ వార్తలు

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది. కరోనా ప్రభావం పెరుగుతున్న తరుణంలో ఈ ఘటన జరగటంతో ప్రధాని నేరుగా సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్ధేశం చేశారు. కేంద్రం నుంచి అన్ని రకాల సహకారం అందించాలని ఆదేశించటంతో ప్రధాని కార్యాలయమే స్వయంగా పర్యవేక్షిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి.

pmo monitoring rescue operations in vishaka

author img

By

Published : May 7, 2020, 8:09 PM IST

కరోనా ప్రభావం రోజురోజుకు తీవ్రమవుతున్న తరుణంలో విశాఖపట్నం ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజి ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నేరుగా ప్రధానమంత్రి రంగంలోకి దిగాల్సి వచ్చింది. విశాఖలో తెల్లవారుజాము నుంచి జరిగిన పరిణామాలు, చేపట్టాల్సిన కార్యచరణపై సుదీర్ఘంగా చర్చించారు.

విశాఖలో చేపడుతున్న కార్యక్రమాలను నిత్యం పర్యవేక్షించాలని ప్రధాని కార్యాలయ ముఖ్య కార్యదర్శి పి.కె. మిశ్రాను ఆదేశించారు. ఈ క్రమంలో ఏపీకి కేంద్రం నుంచి ఏ సహకారమైనా అందించాలని ఎన్డీఆర్​ఎఫ్, ఎన్డీయమ్​ఏ, హోం శాఖ సహా ముఖ్యమైన అధికారులకు మిశ్రా సూచించారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలన్నారు.

అసలు ఎల్​జీ ఫ్యాక్టరీలో ఏం జరిగిందో తెలుసుకోవాలని, మొత్తం పరిణామాలపై పూర్తి నివేదిక అందించాలని ప్రధాని కార్యాలయం ఆదేశించినట్లు సమాచారం. అలాగే సహాయక చర్యలను ప్రధాని కార్యాలయమే స్వయంగా మానిటర్‌ చేస్తున్నట్లు తెలిసింది. ప్రధాని కార్యాలయం, కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి, రసాయన శాఖ కార్యదర్శి నలుగురు సమన్వయం చేసుకుంటూ... వైజాగ్‌ గ్యాస్ లీకేజి ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలను స్వయంగా పర్యవేక్షించాలని నిర్ణయం తీసుకున్నారు.

స్థానిక అధికారులతో పాటు వైజాగ్ కేంద్రంగా పని చేస్తున్న నావికాదళ అధికారులు, పెట్రోలియం శాఖల సహకారంతో చర్యలు ముమ్మరం చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఎల్‌జీ ఫ్యాక్టరీని తమ ఆధీనంలోకి తీసుకున్న పారిశ్రామిక భద్రతా దళ అగ్నిమాపక సిబ్బంది.... పూర్తిస్థాయి రక్షణ చర్యలు చేపట్టింది. ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టటంతో పాటు.. ఇంకా నిల్వ ఉండిపోయిన రసాయనాల తీవ్రతను తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్లు సీఐఎస్‌ఎఫ్ అధికారులు హోంశాఖకు నివేదించారు. పుణే నుంచి విశాఖ చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం మొత్తం ఫ్యాక్టరీ ప్రదేశం, గ్యాస్ ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షించి అంచనాకు వచ్చిన తర్వాత రసాయన చర్యలు తీసుకునే విషయంపై ఒక నిర్ణయం తీసుకోనుంది. వైజాగ్‌లోనే ఉన్న పెట్రోలియం విశ్వవిద్యాలయ నిపుణుల సలహాలు కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి

స్టైరీన్ లీకేజీ... విశాఖలో విషాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.