విశాఖ మన్యంలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపడి యువకుడు మృతిచెందాడు. పెదబయలు మండలం సంపంగి పట్టులో కొంతమంది యువకులు క్రికెట్ ఆడుతుండగా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి. ఫీల్డింగ్ చేస్తున్న పాంగ్ సురేష్ అనే యువకుడికి సమీపంలో పిడుగు పడింది. దాని ధాటికి అతడు స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ సిబ్బంది లేరనీ.. 108 వాహనానికి ఫోన్ చేసినా స్పందించలేదనీ బంధువులు ఆరోపించారు. వెంటనే ప్రైవేటు జీపులో పాడేరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశాడు. వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్లే తమ కుమారుడి మరణించాడని ఆరోపిస్తూ... తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
ఆటలో పిడుగు.. యువకుడి మృతి - పాడేరు
పిడుగుపాటు యువకుడిని బలితీసుకుంది. సరదాగా స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా యముడి రూపంలో వచ్చి అనంత లోకాలకు తీసుకెళ్లింది. స్పృహ తప్పి పడిపోయిన యువకుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశాడు.