ETV Bharat / state

కొండకోనల్లో జీవితం.. అంగవైకల్యంతో పుట్టెడు కష్టం

అంగవైకల్యం వారి జీవితాలను.. నాశనం చేసింది. తల్లిదండ్రులను నానా ఇబ్బందులు పెడుతోంది. కనీసం ప్రభుత్వమైనా.. పింఛను మంజూరు చేస్తుందనుకుంటే.. అధికారుల నిర్లక్ష్యంతో అదీ లేదు.

కొండకోనల్లో జీవితం.. అంగవైకల్యంతో పుట్టెడు కష్టం
కొండకోనల్లో జీవితం.. అంగవైకల్యంతో పుట్టెడు కష్టం
author img

By

Published : Aug 31, 2020, 9:29 AM IST

విశాఖ మన్యం పాడేరు మండలం కుమ్మరి తోము అనే గ్రామంలోని మూడు కుటుంబాల్లో ముగ్గురు బాలికలు అంగవైకల్యంతో ఉన్నారు. కిల్లో భీమన్న, లక్ష్మీ దంపతులకు 11 ఏళ్ల మాధురి అనే అమ్మాయి ఉంది. పుట్టుకతోనే ఆమెకు అంగవైకల్యం. ఓ మనిషి పక్కనుంటేనే పని చేసుకోవడం సాధ్యం. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా సద రమ్ అంగవైకల్య ధ్రువీకరణ పత్రం పొందలేకపోయారు. దీంతో బాలికకు పింఛన్ పొందలేని పరిస్థితి.

కిల్లో భీమన్న సోదరుడు కళ్యాణ్ రాజు అతని కుమార్తె లావణ్య కూడా అంగవైకల్యమే. పుట్టినప్పుడు సరిగానే ఉంది. రెండేళ్ల వయసులో ఆకస్మికంగా ఫిట్స్ వచ్చింది. మాట కూడా పడిపోయింది. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా.. ఫలితం లేదు. ప్రతిరోజు మూడు నాలుగు సార్లు పడిపోతుందని చాలాసార్లు గాయాలపాలు అయిందని ఆమె తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. సదరమ్ సర్టిఫికెట్ పొందారు. పింఛన్ ఇవ్వాలంటూ అధికారులకు అందజేసినా ఫలితం మాత్రం శూన్యం. పింఛన్ మంజూరు చేయాలని వారు కోరుతున్నారు.

మరో బాలిక మరి చిన్నమ్మి కుమార్తె ప్రమోదిని 18 ఏళ్లు. మతిస్థిమితంతో కాలం వెళ్లదిస్తోంది. అధికారులు ఈ మధ్యనే పింఛన్ మంజూరు చేశారు. ఆమో తల్లి ఏదో కష్టపడి నెట్టుకొస్తోంది.

ఇదీ చదవండి: చదరంగం స్వర్ణ విజేతలకు చంద్రబాబు, లోకేశ్ అభినందనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.