కరోనా విపత్కర సమయంలో దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వినూత్న రీతిలో దివ్యాంగులు నిరసన చేపట్టారు. దివ్యాంగుల మహాసేన ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గౌతమ బుద్ధుడి వేషధారణలతో చక్రాల కుర్చీలో కూర్చుని ప్లకార్డులు పట్టుకుని వారు నిరసన తెలియజేశారు.
దివ్యాంగులు చేపట్టిన నిరసనకు తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, జనసేన నేతలు, టియన్ఎస్ఎఫ్ నేతలు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులను అన్ని విధాలా ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో తాము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేక ఆర్ధిక సాయం అందజేయాలని వెలగపూడి రామకృష్ణ బాబు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి