Visakha Pet Fest : మార్షల్స్ పెట్ జోన్ ఆధ్వర్యంలో విశాఖలో పెట్ ఫెస్ట్ ఘనంగా జరిగింది. విశాఖ నగరంలో పెట్ ఫెస్ట్ పేరిట డాగ్ షో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని.. కార్యక్రమంలో పాల్గొన్నవారు హర్షం వ్యక్తం చేశారు. బీచ్ రోడ్ వద్ద ఉన్న ఎమ్జీఎమ్ గ్రౌండ్‌లో పెట్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శునకాలు ఫన్ గేమ్స్, ఫ్యాషన్ షో,ప్లే జోన్ వంటి వాటిలో పాల్గొని అలరించాయి.
ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటం ఎంతో ఆనందంగా ఉందని కార్యక్రమంలో పాల్గొన్నవారంటున్నారు. ఇటువంటి కార్యక్రమాల నిర్వహణ వల్ల ప్రజలలో పెంపుడు జంతువులపై అవగాహన పెరుగుతుందని అన్నారు అనంతరం విజేతగా నిలిచిన శునకాలకు నిర్వాహకులు బహుమతులను అందించారు.
ఇవీ చదవండి :