ETV Bharat / state

నిత్యావసరాలు అందించేందుకు ముందుకొస్తున్న దాతలు

కరోనా మహమ్మారి ప్రభావం పెరుగుతున్న​ నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నిత్యావసరాలు పంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.

people voluntarily given minimum needs to poor
పేదలకు నిత్యావసరాలు తీర్చేందుకు ముందుకోచ్చిన దాతలు
author img

By

Published : Apr 2, 2020, 6:21 PM IST

కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వివిధ వర్గాల కార్మికులకు విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్.. సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేశారు. నర్సీపట్నం మున్సిపాలిటీ కార్మికులకు ఇతర ఒప్పందం కార్మిక సంఘాలకు బియ్యం బస్తాతో పాటు పప్పు, ఉప్పు, నూనె, ఉల్లిపాయలు, కూరగాయలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పార్టీ కార్యాలయంలో అందజేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధికి విరివిగా వివరాలను అందజేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

నిరాశ్రయులు, పేదలు, బిచ్చగాళ్లకు చోడవరం హెల్పింగ్​ హ్యాండ్స్​ ప్రతినిధులు తమ దాతృత్యం చాటుకున్నారు. శ్రీ రామ నవమిని పురస్కరించుకుని పట్టణానికి చెందిన వడ్డీ వ్యాపారి ధర్మతేజ రెడ్డి పలు రకాల వంటకాలు చేయించి ట్రైనీ డీఎస్పీ రవికిరణ్​ చేతుల మీదుగా పేదలకు అందజేశారు.

గోవాడ చక్కెర కర్మాగారం మాజీ చైర్మన్​ కుమారుడు సకురు కోటేశ్వరరావు తన సొంత నిధులతో మాస్క్​లను అందజేశారు. పోలీసు, వైద్యం, పంచాయతీ సిబ్బంది, ఆశా కార్యకర్తలకు ఈ మాస్క్​లు అందించారు.

పాడేరు ఏజెన్సీలో ప్రతి విలేకరికి 25 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను దాతలు అందజేశారు.

విశాఖ జిల్లా అరకులోయ మండలంలో లాక్​డౌన్​ సందర్భంగా ప్రభుత్వ అధికారులు లబ్దిదారుల ఇంటింటికి రేషన్​ సరుకులు పంపిణీ చేస్తున్నారు. రేషన్​ డిపోల వద్దకు ప్రజలు వస్తే కరోనా వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నందున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తహసీల్దార్​ శ్యాంబాబు అన్నారు.

ప్రకాశం జిల్లాలో...

యర్రగొండపాలెంలోని పలు వీధుల్లో ఇస్మాయిల్ చికెన్ సెంటర్ అధ్వర్యంలో పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. బియ్యం, పప్పు, నూనె, ఉల్లిపాయలు తదితర సరుకులను ప్రజలకు అందించారు.

తూర్పుగోదావరి జిల్లాలో...

నవ సేన ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు.. కాకినాడలో సుమారు రెండు వేల మందికి ఉచితంగా సరుకులు పంపిణీ చేశారు. గుడ్లు, బియ్యం, పప్పు, నూనె, పండ్లు, రొట్టె, బిస్కెట్లు, పలు పౌష్టిక ఆహార పదార్థాలను ఇంటింటికి తిరిగి అందజేశారు. జగన్నాధపురంలోని బీసీ సంక్షేమ హాస్టల్​కు నాలుగు రోజులు భోజన వసతి చేస్తున్నామని ఆ సంస్థ వ్యవస్థాపకురాలు ఫరానా బేగం తెలిపారు.

ఇదీ చదవండి:

నాయుడుపేటలోని వ్యక్తికి కరోనా... అధికారులు అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.