ETV Bharat / state

'45 రోజుల లాక్ డౌన్ ప్రతిఫలం ఇదేనా?'

'45 రోజుల లాక్ డౌన్ ప్రతిఫలం ఇదేనా' అంటూ ఓ మహిళ రూపొందించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో హల్​చల్ చేస్తోంది. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దశల వారీగా పెంచుకుంటూ వచ్చింది. జనాలు గుమిగూడకుండా, బయటకు రాకుండా కఠిన ఆంక్షలు విధించింది. 135 కోట్ల పైచిలుకు జనాభా ఉన్న భారత్​లో నేటివరకు 50వేల లోపే కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయంటే అది లాక్ డౌన్ ఫలితమే. మరి ఆ మహిళ ఆవేదనకు కారణమేంటి? ఆ ప్రశ్న ఎందుకు వచ్చింది?

author img

By

Published : May 5, 2020, 12:16 PM IST

Updated : May 5, 2020, 3:12 PM IST

people que at wine shops video viral in social media
మద్యం దుకాణాల ముందు క్యూ
మద్యం దుకాణాల ముందు క్యూ

రాష్ట్రంలో మద్యం దుకాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపుల ముందు జనం క్యూ కట్టారు. చాలాచోట్ల భౌతిక దూరం మరిచి గుంపులుగా చేరారు. ఆ దృశ్యాలను వీడియో తీసిన ఓ మహిళ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.

45 రోజులుగా పాటించిన లాక్ డౌన్, అత్యవసర విభాగాలు చేసిన సేవ, జీతాల్లో కోత విధించుకుని కరోనాపై పోరాటానికి చేసిన త్యాగం, నిరుపేదలను ఆదుకున్న దాతల దాతృత్వం ఈ ఒక్క ఘటనతో వృథా అయిపోయాయని తన బాధను వీడియోలో వ్యక్తం చేసింది.

ఇలా జనం గుంపులుగా తిరిగితే వైరస్ వ్యాప్తి చెందదా అని ప్రశ్నించారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. విశాఖ జిల్లాకు చెందిన మహిళ.. ఈ వీడియోనూ రూపొందించినట్టుగా తెలుస్తోంది.

ఇవీ చదవంండి:

భారత్​లో ఒక్కరోజే 3900 కేసులు.. 195 మరణాలు

Last Updated : May 5, 2020, 3:12 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.