Pensioners Association Agitation: ఈపీఎస్ 95 ప్రకారం కనీస పెన్షన్ 9000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ విశాఖలో ఆందోళన చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్ 2500 రూపాయలుగా ఉంటే... ఎన్నో ఎళ్లుగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వారికి ఇచ్చే పెన్షన్ వెయ్యి రూపాయలుగా నిర్ణయించడం సమంజసం కాదని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఇచ్చే 1000 రూపాయలు పెన్షన్ తో కనీసం ఒక గ్యాస్ బండ కూడా కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నాయని వాపోయారు.
పెన్షన్‌కు డీఏ కలిపి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ పార్కులో పెన్షనర్లు ఆందోళన చేపట్టారు. 1995 నుంచి తమ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇవాళ దేశ విగ్రహ దినంగా పాటిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ కనీసం 9000 రూపాయలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. పెన్షనర్ల సమస్యపై తాత్సారం చేస్తే డిసెంబర్ 7, 8 తేదీల్లోఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: