ETV Bharat / state

విశ్రాంత​ ఉద్యోగులకు పింఛన్​ ఆలస్యానికి కారణం అదేనా..? - ఆంధ్ర యూనివర్సిటీలో విశ్రాంత ఉద్యోగుల పెన్షన్​ తాజా వార్తలు

విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో పని చేసి విరమణ పొందిన వారికి సకాలంలో పింఛన్​లు ​ ఆందడం లేదని పింఛన్​దారులు ఆందోళన చెందుతున్నారు. అయితే సాంకేతిక లోపం కారణంగానే పింఛన్​ ఆలస్యం అయిందని అధికారులు తెలిపారు.

pension Delay for University Retired Employees
విశ్రాంత​ ఉద్యోగులకు ఫించన్​ ఆలస్యం
author img

By

Published : Nov 19, 2020, 3:40 PM IST

సకాలంలో పింఛన్​ అందక :

ఏయూలో విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ చేసిన వారికి సకాలంలో పింఛను అందకపోవటం పింఛన్​దారులు ఆందోళన చెందుతున్నారు. నెలవారీ చెల్లింపులు, అద్దెలు వంటివి మొదటి వారంలో కట్టాల్సి రావడం కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక పెన్షన్​తీసుకునేవారిలో ఎక్కువ మంది ఆరోగ్య సమస్యల ఎదుర్కోవడం, మందుల వ్యయం కూడా ఎక్కువగానే ఉంటుంది. దీంతో పింఛన్​ఆలస్యం కావడం వీరంతా మరింత ఆందోళన చెందుతున్నారు.

విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో చెల్లింపులు జరిగినప్పుడు ఒకటి, రెండు తేదీల్లో పింఛన్​ జమయ్యేది. ప్రస్తుతం దీపావళి పండుగ నాటికి కూడా డబ్బులు అందక తీవ్ర నిరాశలో గడపాల్సిన పరిస్థితి వచ్చిందని పలువురు చెబుతున్నారు. గతంలో ప్రభుత్వం ‘బ్లాక్‌ గ్రాంట్‌’ నిధులను విశ్వవిద్యాలయానికి మంజూరు చేస్తే.. ఆ మొత్తం నుంచి జీతాలు, పింఛన్లు చెల్లించేవారు. ఖజానా శాఖ పరిధిలోనికి పింఛన్​​ చెల్లింపులు వెళ్లిన తరువాత.. అధికారులు పింఛనర్ల వివరాలను వారికి పంపుతున్నారు. దీని కోసం ‘కాంప్రహెన్సివ్‌ ఫైనాన్సియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం’ను రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తోంది. ఈ ప్రక్రియలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందుతున్నప్పటికీ.. పింఛన్​ ఆలస్యమవుతుండటం గమనార్హం.

సాంకేతిక సమస్యలే కారణం :

పింఛన్ చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యం గురించి ఉన్నతాధికారులను వివరణ కోరగా.. పెన్షన్​దారుల ఖాతాకు నగదు పంపే వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ఆలస్యమైందని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి...

ప్రపంచ స్మార్ట్‌సిటీ అవార్డుల పోటీలో.. తుది జాబితాలో విశాఖకు చోటు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.