విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనా స్థలిని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ పరిశీలించారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే రియాక్టర్ నుంచి గ్యాస్ లీకైందని.. ప్రమాదానికి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. గతంలోనూ ఈ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు తెలిపారు.
ప్రభుత్వం నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకూ కంపెనీ మూసివేయాలని సీఎం ఆదేశించినట్లు ఎమ్మెల్యే చెప్పారు.
ఇదీ చూడండి..