విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం (పాలవెల్లి) మధ్యతరహా జలాశయం విద్యుత్ బకాయిలు మంజూరు చేస్తూ జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ బకాయిలు పేరుకుపోవటంతో జలాశయానికి 2012 నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అప్పటి నుంచి జలాశయం అంధకారంలో ఉంది. గేట్లు ఆపరేటింగ్ చేయడానికి, ఇతర అవసరాలను డీజిల్‌తోనే నిర్వహిస్తున్నారు.
అప్పటి నుంచి విద్యుత్ బకాయిల మంజూరుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిస్తూనే ఉన్నారు. స్పందించిన జలవనరుల శాఖ 2019 డిసెంబర్ వరకు ఉన్న బకాయిలు చెల్లింపునకు రూ.45.03 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై సంబంధిత ఏపీఎస్పీడీసీఎల్ విద్యుత్ శాఖకు ప్రతిపాదనలు పంపించారు. ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన విద్యుత్ బకాయిలు మంజూరైనందున రైతులు, జలవనరుల శాఖ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి..
చౌక బియ్యం గోదాంలో తనిఖీలు.. 75 లక్షలు విలువచేసే బియ్యం పట్టివేత