విశాఖ జిల్లా మాడుగుల మండలంలోని పెద్దేరు జలాశయం నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. జలాశయంలో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న అదనపు నీటిని ఒడిసి పడుతున్నారు. నీటిమట్టం గరిష్ట స్థాయి దాటితే... దిగువ నదిలోకి అదనపు నీటిని విడిచి పెడుతున్నారు. జలాశయంలో నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని జలవనరుల శాఖ అధికారులు అన్నారు. రానున్న రబీ సీజన్‌కు సాగునీటికి.. వేసవిలో నీటికి ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆయకట్టు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుంచి 63 క్యూసెక్కుల అదనపు నీరు జలాశయంలోకి వచ్చి చేరుతుంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 137 మీటర్ల కాగా...ప్రస్తుతం 136.70 మీటర్ల వద్ద ఉంది. నీటి మట్టం గరిష్టస్థాయి వద్ద నిలకడగా ఉందని...జలాశయం ఏఈ సుధాకర్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: