జీవో నెంబర్ 3ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఏజెన్సీలో గిరిజనులు చేస్తున్న బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. జీవో రద్దుతో చాలామంది నిరుద్యోగులుగా మారతారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ మన్యంలోని 11 మండలాల్లో గిరిజనులు ఆందోళనలు చేపట్టారు. వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులు మూసివేశారు. ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. పాడేరులో జీవో 3 సాధన కమిటీ సభ్యులు రహదారికి అడ్డంగా కూర్చుని నిరసన తెలిపారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆందోళన చేశారు. ప్రత్యేక చట్టం తీసుకురావాలని గిరిజనులు కోరారు.
పశ్చిమగోదావరి జిల్లా మన్యంలోని ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించాలని గిరిజనులు బంద్ చేపట్టారు. బుట్టాయగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు బంద్‌లో పాల్గొన్నారు. బుట్టాయగూడెం తహసీల్దార్ కార్యాలయం ముందు ఆదివాసీ సేన ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జీవో నెంబర్ 3 రద్దు గిరిజనుల హక్కులను కాలరాయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది చదవండి సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ