ETV Bharat / state

Pawan Kalyan: వైసీపీ దోపిడిని అడ్డుకోవటమే ప్రధాన లక్ష్యం.. జనసేన నేతలకు పవన్​ సూచన - విశాఖలో పవన్​కల్యాణ్​ సమావేశం

Pawan Kalyan Meeting With Party Leaders: ఈ నెల 10వ తేదీ నుంచి విశాఖలో జనసేన అధినేత పవన్​ కల్యాణ్ మూడోవిడత​ వారాహియాత్ర ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలతో మంగళగిరిలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ విశాఖలో అనుసరించాల్సిన విదివిధానాలపై దిశానిర్దేశం చేశారు. మహిళల మిస్సింగ్​ వ్యాఖ్యాలపై స్పందించిన ఆయన.. తాను ఊరికే మాట్లాడలేదని.. కేంద్రం నుంచి లభించిన బలమైన అధారాలతోనే వ్యాఖ్యానించినట్లు గుర్తుచేశారు.

pawan kalyan
జనసేన అధినేత పవన్​కల్యాణ్​
author img

By

Published : Aug 4, 2023, 10:39 AM IST

మూడో విడత వారాహి యాత్రకు సంబంధించి పార్టీ నేతలతో పవన్ సమావేశం

Pawan Kalyan Meeting With Party Leaders in Mangalagiri: ఉత్తరాంధ్రలో వైసీపీ సర్కార్ చేసే దోపీడీలను దేశమంతా తెలియజేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్​ పార్టీ నేతలకు సూచించారు. విశాఖలో జరుగుతున్న భూ కబ్జాల కట్టడిని, ఉత్తరాంధ్ర వనరులను దోచే వారిని నిలువరించడమే లక్ష్యంగా.. మూడో విడత వారాహి యాత్ర సాగుతుందని పవన్​ స్పష్టం చేశారు. ఈ నెల 10న విశాఖలో ప్రారంభమయ్యే మలివిడత వారాహి యాత్రపై మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. మహిళల అదృశ్యమవుతున్నారని కేంద్రం నుంచి అందిన బలమైన డేటా ఆధారంగా చెప్పానని పవన్ పునరుద్ఘాటించారు.

జనసేనాని పవన్ కల్యాణ్ మూడో విడత వారాహి యాత్ర విశాఖపట్నం నుంచి ప్రారంభం కానుంది. దీనిపై చర్చించేందుకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విశాఖ జిల్లా నేతలు, వారాహి యాత్ర కమిటీల సభ్యులతో పవన్ సమావేశమయ్యారు. జనసేన పార్టీకి విశాఖ చాలా కీలకమైన ప్రాంతమని పవన్ కల్యాణ్ పార్టీ నేతలకు తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో విపరీతమైన ప్రకృతి విధ్వంసం జరుగుతోందని పవన్ కల్యాణ్ అన్నారు. అధికార పార్టీ పెద్దల కనుసన్నల్లోనే కబ్జాకు గురైన భూములను, కరిగిపోతున్న ఎర్రమట్టి దిబ్బలను, రుషికొండను పరిశీలిస్తామన్నారు. ఉత్తరాంధ్రలో జరిగే దోపిడీని జాతీయ మీడియా ద్వారా దేశమంతా తెలిసేలా చేయాలని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు.

జనసేనకు విశాఖ చాలా కీలకమైనదని పార్టీ నేతలకు వివరించారు. విశాఖలో జనసేనను అడ్డుకున్న సమయంలో పోలీసులు ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులను తట్టుకుని నిలబడ్డారని పార్టీ శ్రేణులను పవన్​ అభినందించారు. వైసీపీ పాలనలో విపరీతమైన భూ అక్రమణలు పెరిగిపోయాయని అన్నారు. విశాఖలో కాలుష్యం కూడా పెరిగిపోయిందని.. పరిశ్రమల కాలుష్యం తగ్గించాల్సి ఉందన్నారు. దానిపై ఎవరు దృష్టిసారించకపోవటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

"విశాఖ చాలా కీలకమైనది మనకు. విశాఖ వివాద సమయంలో పోలీసులు, ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులకు మీరు తట్టుకుని నిలబడినందుకు మీకు మనస్పూర్తిగా అభినందనలు. ఎన్డీఏలో కీలకస్థానం కల్పించటానికి.. కీలక మలుపు విశాఖలో జరిగింది. వైసీపీ పాలనలో ప్రకృతి విధ్వంసం.. విపరీతమైన భూ అక్రమణలు నెలకొన్నాయి. పరిశ్రమల కాలుష్యం తగ్గించాల్సిందిపోయి దానిపై ఎవరు దృష్టి పెట్టకపోవటం ఇవన్నీ చాలా బాధ కలిగించే విషయాలు." - పవన్​ కల్యాణ్​, జనసేన అధినేత

రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు మిస్సయ్యారని కేంద్ర హోం శాఖ పార్లమెంటులో చెప్పటం తన మాటలకు బలం చేకూర్చిందన్నారు. ఏం మాట్లాడినా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని మాట్లాడతానని.. ఊరికే ఆరోపణలు చేయనని పవన్ స్పష్టం చేశారు. పెందుర్తిలో పెద్దావిడను వాలంటీర్ హత్య చేసిన విషయం కదలించిందన్న పవన్.. వారాహి యాత్రలో భాగంగా ఆ కుటుంబాన్ని కలుస్తానన్నారు. మూడో విడత వారాహి యాత్ర పూర్తయ్యేలోపు ఉత్తరాంధ్రలోని భూకబ్జాలు నిలువరించేడమే లక్ష్యంగా పెట్టుకోవాలని పార్టీ నేతలకు పవన్ కల్యాణ్ సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.