విశాఖ వాసుల కొంగు బంగారంగా పిలిచే సింహాచలం అప్పన్న స్వామి పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. మెుదటి రోజు అంకురార్పణతో మెుదలై.. రెండో రోజు హోమాలు, మూడో రోజు పవిత్ర సమర్పణ హోమాలు నిర్వహిస్తారు. ఐదో రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి పవిత్రోత్సవాలను ముగిస్తారు. ఉత్సవాల సందర్భంగా రాత్రి ఏడు గంటల వరకే స్వామి వారి దర్శనాలకు అనుమతి ఉందని పురోహితులు తెలిపారు. పవిత్రోత్సవాల సందర్భంగా స్వామి వారకి జరిగే ఆర్జిత సేవలు రద్దు చేశారు.
ఇదీ చదవండి: