విశాఖ జిల్లా సింహాచలంలోని శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి నిత్య అన్నప్రసాద వితరణ.. పునః ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో.. కొన్ని రోజులుగా ఆలయాధికారులు అన్న ప్రసాద వితరణను నిలిపివేశారు. ప్రభుత్వం కర్ఫ్యూ ఆంక్షలు సడలించటంతో.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయాలని.. దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు ఆదేశించారు. ఈ మేరకు కదంబం ప్రసాదాన్ని పొట్లాల రూపంలో భక్తులకు వితరణ చేశారు.
జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా చందన సమర్పణ
ఈ నెల 24న జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా.. అప్పన్నకు మూడో విడత చందన సమర్పణ జరగనుంది. ఈ మేరకు ఆలయ బేడా మండపంలో.. సిబ్బంది 5 రోజులుగా చేపట్టిన చందనం అరగదీత ప్రక్రియ ముగిసింది. 131.3 కిలోల శ్రీగంధం సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఈ గంధంలో సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి స్వామికి సమర్పించనున్నారు.
ఇదీ చదవండి:
Tirumala: నేటినుంచి.. మూడు రోజుల పాటు శ్రీవారికి జ్యేష్టాభిషేకం