ETV Bharat / state

ఏజెన్సీలో జోరుగా నామినేషన్లు.. 17న ఎన్నికకు విస్తృత ఏర్పాట్లు - ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఓటింగ్ ప్రక్రియ న్యూస్

విశాఖ పాడేరు ఏజెన్సీలో ఈ నెల 17న జరగనున్న మూడో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతోంది. పోలింగ్ రోజున ప్రక్రియ సజావుగా పూర్తి చేసేందుకు ఇప్పట్నుంచే విస్తృత ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు.

Panchayat elections from 17 in Visakhapatnam Paderu Agency
'ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఓటింగ్ ప్రక్రియ'
author img

By

Published : Feb 7, 2021, 5:38 PM IST

విశాఖ పాడేరు ఏజెన్సీలో ఎన్నికల కోలాహలం వేడెక్కింది. ఆశావహులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. ఈ నెల 17న జరగనున్న మూడో విడత పంచాయతీ ఎన్నికలకు... పాడేరు డివిజన్ పరిధిలోని 11 మండలాల నుంచి.. 344 సర్పంచ్ అభ్యర్థులు.. 423 వార్డు మెంబర్లు.. తొలిరోజు నామినేషన్లను దాఖలు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో చాలామంది అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు అందని కారణంగా... ఆందోళన పడుతున్నారని పాడేరు ఆర్డీఓ లక్ష్మీ శివజ్యోతి చెప్పారు.

సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ఆమె తెలిపారు. గతంలో ఏజెన్సీ వ్యాప్తంగా 60 శాతం మాత్రమే పోలింగ్ ఉందని.. ప్రస్తుతం 90 శాతం పైగా నమోదవ్వాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికలు జరిగే 17వ తేదీని పాడేరు డివిజన్​లో సెలవు దినంగా ప్రకటించారు. ఓటింగ్ ప్రక్రియ ఉదయం ఆరున్నర నుంచి మధ్యాహ్నం ఒంటిగంటన్నర వరకు నిర్వహిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

లంబసింగి అభివృద్ధికి మరిన్ని చర్యలు: ఎంపీ మాధవి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.