ETV Bharat / state

'మోదీ నిర్ణయాలతో అన్యమత ప్రచారం, మత మార్పిడుల నియంత్రణ' - foreign affairs minister

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి దిల్లీలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మురళీధర్​ను ఆయన నివాసంలో కలిసారు. పలు ధార్మిక అంశాలపై చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాలతో దేశంలో అన్యమత ప్రచారం, మత మార్పిడులు నియంత్రణలోకి వస్తున్నాయని అన్నారు.

Sharada peetam
స్వాత్మానందేంద్ర సరస్వతీ
author img

By

Published : Sep 21, 2021, 9:43 PM IST

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి దిల్లీలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మురళీధర్​ని ఆయన నివాసంలో కలిసారు. పలు ధార్మిక అంశాలపై చర్చించారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాలతో దేశంలో అన్యమత ప్రచారం, మత మార్పిడులు నియంత్రణలోకి వస్తున్నాయని ఆయన అన్నారు.

స్వచ్ఛంద సంస్థల ముసుగులో కొన్ని సంస్థలు విదేశాల నుంచి మిషనరీ నిధులు తీసుకొచ్చి నిరుపేద వర్గాలను లక్ష్యంగా చేసుకుని ప్రలోభాలకు గురి చేస్తున్నాయన్నారు. విదేశాల నుంచి వచ్చే నిధులపై ఆంక్షలు విధించడం ద్వారా మోదీ ప్రభుత్వం హిందూ ధర్మానికి మేలు చేసిందని ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాల్లో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి ధర్మ పరిరక్షణకు చేపడుతున్న కృషిని, తాను చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర గురించి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వివరించారు. దళితులు, గిరిజనులతో కలిసి తిరుమలకు వెళ్ళినట్లు తెలిపారు. అక్షరాస్యత ఎక్కువగా ఉన్న కేరళ రాష్ట్రంలో విదేశీ మతాల ప్రభావం అధికంగా ఉందని కేంద్రమంత్రి మురళీధర్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: బ్యాంకు మేనేజర్‌ ఉద్యోగం వదిలి.. సేవా మార్గంలోకి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.