విశాఖ జిల్లా కశింకోట మండలం విస్సన్నపేటలో పడమటమ్మ తల్లి పుట్టుక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రెండేళ్లకొకసారి నిర్వహించే ఈ ఉత్సవంలో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారిని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సతీమణి హిమగౌరి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గొంతిన కుటుంబీకుల ఇలావేల్పుగా పడమటమ్మ లోవలో వెలసిన అమ్మవారిని దర్శించుకోడానికి జిల్లాలోని పలు ప్రాంతాలనుంచి వచ్చిన భక్తులతో కోలాహలంగా మారింది. కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉత్సవం ఎలా జరుగుతుందంటే..
ఆలయంలోని మర్రి చెట్టు వద్ద అమ్మవారు మిడత, ఇతర పురుగు రూపంలో వస్తారని భక్తుల నమ్మకం. గొంటిన కుటుంబసభ్యులు పల్లకిలో బంతి పూల అలంకరణతో భరణి తీసుకొస్తారు. మర్రి చెట్టు వద్ద పూజలు చేసి అమ్మవారిని పిలుస్తారు. పురుగు రూపంలో వచ్చే అమ్మవారిని భరణిలో పెట్టి వీధుల్లో ఊరేగిస్తారు. రాత్రి వరకు జరిగే ఊరేగింపులో భాగంగా అమ్మవారి పల్లకిని కశింకోట తీసుకొస్తారు. అక్కడ నెలరోజులు పూజలు చేసిన అనంతరం
వచ్చే నెల పండగ నిర్వహిస్తారు.
ఇవీ చదవండి