బకాయి పడ్డ జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ... విశాఖలో జీవీఎంసీ మలేరియా విభాగం కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలు రెండో రోజుకు చేరాయి. కరోనా సమయంలో తమతో ఇష్టం వచ్చినట్లు పని చేయించుకున్న ప్రభుత్వం ఇప్పుడు తమను రోడ్డుపై పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
జీవీఎంసీ గాంధీ పార్క్లో ఇవాళ రెండో రోజు నిరవధిక దీక్షలు చేపట్టారు. బకాయి పడ్డ జీతాలు చెల్లించకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీతాలు వెంటనే చెల్లించాలని మలేరియా విభాగం కార్మికులు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: