విశాఖ జిల్లాలో క్రమంగా వర్షాలు పడుతున్నాయి. దాంతో లోతట్టు ప్రాంతల్లో వర్షపు నీరు చేరి, దోమలకు ఆవాసంగా మారి క్రమంగా జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 641 మలేరియా, 290 డెంగీ కేసులు నమోదైనట్లు వెద్యులు వెల్లడించారు. అటు ఏజెన్సీతో పాటు మైదాన ప్రాంతంలోనూ కేసులు నమోదవుతున్నాయి. దాంతో అప్రమత్తమైన అధికారులు అవసరమైన మందులను, వైద్య సిబ్బందిని సిద్ధం చేశారు. వచ్చే మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. నీరుంటే దోమలు పెరిగి.. మలేరియా, డెంగీ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు.
నగరంలో డెంగ్యూ,మలేరియా వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని విశాఖ మహానగరపాలక సంస్థ కమిషనర్ సృజన తెలిపారు. ప్రైవేటు ల్యాబ్‌ల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘించి పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కేవలం కేజీహెచ్‌లో మాత్రమే డెంగీ నిర్ధారణ పరీక్షలు చేస్తారని తెలిపారు.
ఇదీ చదవండి