జనావాసాల మధ్యలో..
ఎల్‌జీ పాలిమర్స్ సంస్థ ప్రస్తుతం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) పరిధిలో ఉంది. విశాఖ పట్టణాభివృద్ధి సంస్థ(వుడా) బృహత్తర ప్రణాళిక ప్రకారం పారిశ్రామిక జోన్‌లోనే పరిశ్రమ ఉంది. సుమారు 52 ఏళ్ల కిందట నగరానికి దూరంగా ఏర్పాటైన పరిశ్రమ చుట్టూ పట్టణీకరణ వల్ల నివాస ప్రాంతం అభివృద్ధి చెందింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పలు పారిశ్రామిక జోన్‌లు, కర్మాగారాలు జనావాసాల పరిధిలోకి చేరాయి. వివిధ పరిశ్రమలకు కేంద్రంగా ఉన్న విజయవాడ ఆటోనగర్ కూడా ఇదే తీరులో ఉండటం గమనార్హం.
సమాచారం కోసం ఆదేశం
తాజా దుర్ఘటన నేపథ్యంలో పట్టణ పరిధిలో ఉన్న పారిశ్రామిక జోన్‌లు, పరిశ్రమల వివరాల గురించి నివేదిక ఇవ్వాలని పరిశ్రమల శాఖను ఆదేశించాం. భవిష్యత్తులో ప్రజలకు ప్రాణనష్టం లేకుండా చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి అధికారులతో చర్చిస్తాం. పట్టణ పరిధిలో ఉన్న పరిశ్రమలపై ఎలా వ్యవహరించాలనే దానిపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
ఇవీ చూడండి...