బుద్ధుడు నడిచిన నేలగా విశాఖను పిలుస్తారు కాబట్టే వైశాఖి నగరంగా పేరొచ్చింది. ఇక్కడి బౌద్ధారామాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది. ప్రభుత్వం మాత్రం ఇవేం పట్టించుకోకుండా ఆరామాల వద్ద ఇండియన్ నేవీ నిర్మాణాలకు అనుమతి ఇవ్వడంపై బౌద్ధ సంఘాలు ఆగ్రహిస్తున్నాయి. విశాఖలో తోట్ల కొండ, భావికొండ, బోజన్నకొండ, పావురాలకొండ బౌద్ధ రామాలుగా ప్రసిద్ధి పొందాయి. జపాన్, చైనా, మలేషియా దేశ ప్రజలు సైతం ఈ బౌద్ధ క్షేత్రాలను సందర్శించటానికి వస్తుంటారు. వీటిని పాడుచేస్తే ఒప్పుకునేది లేదని.. వెంటనే ప్రభుత్వం ఆపేయాలని సభ్యులంతా వేడుకుంటున్నారు. గతంలో ఇదే తరహాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి బౌద్ధ ప్రాంతాలపై అనుమతి ఇచ్చి వెనక్కు తీసుకున్నారని ఇప్పుడు అదే తరహాలో పునరాలోచించాలని స్థానికులు కోరుతున్నారు.
మైనార్టీలకు పెద్ద పీఠవేసింది జగన్ ప్రభుత్వమే :ఉపముఖ్యమంత్రి