ETV Bharat / state

సింహాద్రి అప్పన్న సన్నిధిలో రెండవ టోల్ గేట్ ప్రారంభం

విశాఖ జిల్లా సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో రెండో టోల్​గేట్​ను ప్రారంభించారు. అన్​లాక్​ అనంతరం భక్తుల రద్దీ పెరుగుతుండటంతో దేవాదాయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Opening of the second toll gate
అప్పన్న సన్నిధిలో రెండవ టోల్ గేట్ ప్రారంభం
author img

By

Published : Dec 12, 2020, 3:57 PM IST

విశాఖలోని సింహాద్రి అప్పన్న సన్నిధిలో రెండవ టోల్​గేట్​ను ప్రారంభించారు. లాక్​డౌన్​ అనంతరం స్వామి వారి దర్శనార్థం భక్తుల రాక పెరగటంతో ఈ వసతి కల్పించినట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. విశాఖ నుంచి వచ్చే భక్తులకు కొత్త టోల్​గేట్​ వద్దే దర్శనం టిక్కెట్లు కూడా విక్రయిస్తున్నామన్నారు.

కొండ దిగువన శ్రీదేవి కాంప్లెక్స్ వద్ద దర్శనం టిక్కెట్లు ఇస్తుండడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వారాంతంలో ఈ రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ సమస్యకు పరిష్కారంగా..నగరం నుంచి వచ్చేవారు టోల్​గేట్​ మార్గాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: విశాఖ ఏజెన్సీలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.