ఆంధ్ర - ఒడిశా సరిహద్దులో గల డుడుమ జలపాతంలో ఓ యువకుడు గల్లంతుయ్యాడు. జయపురం సమీపంలో గల కాలియగాంకు చెందిన సత్యపరాజ(23) తన సోదరుడు, మిత్రులతో నూతన సంవత్సరం సందర్భంగా డుడుమ సందర్శించారు.
వీరిలో సత్యపరాజు ఒక బండ రాయి మీద గెంతుతుండగా అదుపు తప్పి నీటిలో పడి పోయాడు. మిత్రులు, సోదరుడు వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న మాచ్కండ్ పోలీసులు, లమతపుట్ అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి