ETV Bharat / state

భూమిని అమ్మేందుకు ఒప్పుకోలేదని.. వ్యక్తి ఆత్మహత్య - one suicide at anakapalli news

భూమిని అమ్మేందుకు తల్లి, సోదరుడు ఒప్పుకోలేదన్న మనస్థాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగింది.

one committed suicide
వ్యక్తి ఆత్మహత్య
author img

By

Published : Feb 1, 2021, 10:49 AM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలోని చినబాబు కాలనీలో వ్యక్తి ఉరివేసుకొని.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్. భీమవరానికి చెందిన ఎస్. వెంకట సింహాద్రి అప్పలనాయుడు అలియాస్ నాయుడు.. భార్య, కుమార్తెతో చినబాబు కాలనీలో ఉంటున్నారు. అనకాపల్లి మండలం కూండ్రమ్​లో ప్రైవేటు కాన్వెంట్​ను నిర్వహించేవారు.

కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో.. తనకు ఉన్న భూమిని అమ్మి అప్పులు తీర్చాలని అనుకున్నాడు. కానీ.. భూమిని విక్రయించేందుకు నాయుడు తల్లి చల్లయమ్మ, తమ్ముడు హేమ సుందర్రావు ఒప్పుకోలేదు. ఈ కారణంగా మనస్థాపం చెందిన నాయుడు ఇంట్లోనే.. ఫ్యాన్​కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

ఏవోబీలో ఎదురుకాల్పులు... మావోయిస్టు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.