విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్లో వరద వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి అధికారులు రంగంలోకి దిగారు. ఈ మేరకు ఇళ్లు, పంటలను పరిశీలించారు. నర్సీపట్నంతో పాటు రోలుగుంట, రావికమతం, గొలుగొండ, మాకవరపాలెం, నాతవరం తదితర మండలాల్లో తహసీల్దార్లు ఇతర అధికారులు పర్యటించారు. గృహాలకు సంబంధించిన వివరాలను వివిధ కేటగిరీల్లో నమోదు చేశారు.
ఇదీ చూడండి. సచివాలయంలో హౌస్ కీపింగ్ సేవలకు నిధులు మంజూరు